మహిళను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్.. హైదరాబాద్ శివారులో దారుణ ఘటన

  • నార్సింగి పరిధిలోని పుప్పాలగూడలో ఘటన
  • నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం
  • నిందితుల్లో ఒకరిని పట్టుకున్న స్థానికులు
మహిళను కిడ్నాప్ చేసిన ముగ్గురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై చిత్రహింసలకు గురిచేశారు. వారి చెర నుంచి తప్పించుకుని బయటపడిన మహిళ రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు. హైదరాబాద్ శివారు నార్సింగి పరిధిలోని పుప్పాలగూడలో నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. మహిళను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై చిత్రహింసలకు గురిచేశారు. వారి బారి నుంచి తప్పించుకుని ఎలాగోలా బయటపడిన బాధిత మహిళ రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక్కడు మాత్రం వారికి చిక్కాడు. అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
narsingi
kidnap
rape

More Telugu News